Monday, 21 January 2013

Jr.NTR Baadshah Audio Release

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా తెరకెక్కుతున్న కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బాద్షా’. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం ‘బాద్షా’ సినిమా ఆడియోని మార్చి 10న విడుదల చేయనున్నారు. అలాగే సినిమాని ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ జనవరి 9 నుంచి ప్రారంభమైంది. జనవరి 16 నుంచి ఎన్.టి.ఆర్ ఈ షెడ్యూల్లో పాల్గొంటారు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారు. బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ సినిమాలోని కొన్ని పాటలని చలా కొత్తగా, గ్రాండ్ గా షూట్ చేయాలని శ్రీను వైట్ల, బండ్ల గణేష్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

No comments:

Post a Comment